సెంట్రల్‌ జైలుకు టీడీపీ నేత పట్టాభి తరలింపు

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రతి నిధి పట్టాభి రామ్‌ ను రాజ మండ్రి సెంట్రల్‌ జైలు కు తరలించారు విజయ వాడ పోలీసులు. ఇవాళ వేకువ జామున మచిలీపట్నం సబ్‌ జైల్‌ నుంచి భారీ బందో బస్తు మధ్య రాజమండ్రి సెంట్రల్‌ జైలు కు తరలించారు పోలీసులు.

భద్రతా కారణాల దృష్ట్యా రాజమండ్రి సెంట్రల్‌ జైలు కు తరలించినట్లు గా పోలీసులు చెప్పారు. పట్టాభి తరఫున ఇవాళ విజయ వాడ కోర్టు లో బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేయనున్నారు. టీడీపీ నేత పట్టాభి రామ్‌ ను కస్టడీకి తీసుకునేందుకు కోర్టు లో పిటీషన్‌ దాఖలు చేశారు పోలీసులు.

పట్టాభి పోలీస్‌ కస్టడీతపై ఇవాళ కోర్టు లో వాదోప వాదనలు జరుగనున్నాయి. కాగా… 20 వ తేదీన రాత్రి టీడీపీ నేత పట్టాభి ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిపై పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తలుపులు పగుట కొట్టి మరీ.. పట్టాభిని అరెస్ట్‌ చేశారు పోలీసులు.