టీడీపీకి అధికారయావ ఏ రేంజ్ లో ఉందంటే…!

-

అధికారం ప్రజలు ఇవ్వాలి కానీ అధికారంలో ఉన్నవారి దగ్గరనుంచి బలవంతంగా లాక్కుంటేనో, అధికారంలో ఉన్న వారిని బెదిరిస్తేనో, బలవంతం పెడితేనో వచ్చేస్తుందా? అన్ని వర్గాల ప్రజల అండదండలూ ఉంటేనే ఏపార్టీకైనా అధికారం వస్తుంది! ఇంతకాలం అధికారంలోఉన్న టీడీపీ నాయకులకు ఇది తెలియని విషయం కాదు కానీ… గతంలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా రేపటిపై ఎక్కడో ఆశ ఉండేది. అది గతం! కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. టీడీపీలో రేపు అనే ఆలోచన రోజు రోజుకీ సన్నగిల్లిపోతుంది.. కాదు కాదు.. సన్నగిల్లిపోయేలా చేస్తున్నారు! ఈ పరిస్థితుల్లో ఏదైనా అద్భుతం జరిగితే మళ్లీ కుర్చీ ఎక్కాలని తెలుగు దేశం నేతలు తెగ ఆలోచించేస్తున్నారు… అది సాధ్యం కాకపోయే సరికి ఏ చిన్న అవకాశం దొరికినా కుర్చీ కావాలని అడుగుతున్నారు!

ఏపీలో జగన్ సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని… పరిపాలించడం రాకపోతే ఒక నెలరోజులు చంద్రబాబుకు ఆ కుర్చీ ఇవ్వాలని జగన్ కు సూచించేశారు టీడీపీ నేతలు! ఐదేళ్లు ఇస్తే జరగంది 30 రోజులు ఇస్తే జరుగుతుందా అనే ప్రశ్నకు టీడీపీ నేతలనుంచి సమాధానం లేదనన్న విషయం కాసేపు పక్కనపెడితే… తాజాగా నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రాజకీయాలు ప్రారంభించారు టీడీపీ నేతలు! ఆ తీర్పు ను చూపిస్తూ… మళ్లీ బాబుకే ఆ కుర్చీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు! తాజా హైకోర్టు తీర్పుపై మైకులందుకున్న టీడీపీ నేతలు ఎవరు ఎలా స్పందించారో ఇప్పుడు చూద్దాం!

ఎన్నికల కమిషనర్‌ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునకు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేయగా… సీఎం జగన్‌ కు నైతిక విలువలుంటే ఆయనతోపాటు కేబినెట్‌ కూడా రాజీనామా చేసెయ్యాలని మాజీ మంత్రి పరిటాల సునీత వ్యాఖ్యానించారు! ఎట్టిపరిస్థితుల్లోనూ జగన్ రాజినామా చేయాల్సిందేనని బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేస్తే… హైకోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం ఆ కుర్చీలో కూర్చునే హక్కు జగన్ కు లేదని ఇంకొంతమంది టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు! ప్రభుత్వ నిర్ణయాలు – న్యాయస్థానాల తీర్పులు అనేది ప్రజాస్వామ్యంలో రొటీన్ ప్రక్రియ అని మరిచిన ఈ నేతలు… తమ అధికారయావను ఇలా ప్రదర్శించుకుంటున్నారు! ఎంత అధికార యావ ఉంటే మాత్రం మరీ ఇలానా?

Read more RELATED
Recommended to you

Latest news