మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ఎవరు కారణం ఏంటి అని అడిగితే చెప్పడం కాస్త కష్టంగానే ఉంటుంది. కాని పార్టీ అధిష్టానం కూడా ప్రధాన కారణం అనే విషయం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. పార్టీ అధిష్టానం నేతల మధ్య సమన్వయం అనేది పెద్దగా కనపడలేదు అనే విషయం చెప్పాలి. చంద్రబాబు నాయుడు ఆదేశాల ఎవరు పాటిస్తున్నారు ఏంటి అనేది కూడా అర్థం కాలేదు.
ప్రచారం చేసే విషయంలో వైసీపీ నేతలు చాలా వరకు కూడా కష్టపడ్డారు. విజయవాడ పరిధిలో విజయం కోసం మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ గట్టిగా ప్రచారం చేశారు. ప్రతి వార్డుకి కూడా తిరిగి ప్రచారం చేయడం మనం చూశాం. కానీ టీడీపీ నుంచి మాత్రం ఎవరూ కూడా విజయవాడ పరిధిలో ప్రచారం చేయలేదు. ఎక్కువసేపు ఉండలేదు… ఇక ప్రజల సమస్యలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసిన పరిస్థితి ఎక్కడా లేదు.
ఎంతసేపు రాజధాని ఉద్యమం విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యమం మినహా అవసరమైన విమర్శలు చేయలేదు. దీని కారణంగా తెలుగుదేశం పార్టీ విజయవాడ పరిధిలో ప్రజల్లో చులకన అయిపోయిందని చెప్పాలి. ఇదే విధంగా కొంతమంది నేతలు భవిష్యత్తులో కూడా కొనసాగితే తెలుగుదేశం పార్టీ విజయవాడతో పాటుగా రాష్ట్రంలో పార్టీని పూర్తిగా నాశనం చేసుకున్నట్టే ఉంటుంది. ఇక విశాఖ గుంటూరు పరిధిలో కూడా అలాగే ప్రచారం చేశారు. అధిష్టానం నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో కిందిస్థాయి నాయకులకు దిశానిర్దేశం చేయలేకపోయారు.