వైసీపీ కార్యకర్తలకే జాబ్ మేళానా..నిరుద్యోగులకు వద్దా అని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు. సీఎం జగన్ ఇస్తానన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ ? అని నిలదీశారు. నాడు కులం, మతం, రాజకీయం చూడం అని పలికిన కుహనా మేధావులు కేవలం వైసీపీ కార్యకర్తలకే జాబ్ మేళాలు నిర్వహించటం ఏంటి? అని ప్రశ్నించారు.
దీన్ని పక్షపాతం అనాలా లేక బరితెగింపు అనాలా? వైసీపీ కార్యకర్తలకు జాబ్ మేళాలు ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఎలా నిర్వహిస్తారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలకు జాబ్ మేళాలు నిర్వహించాలంటే తాడేపల్లి ప్యాలెస్సులోనో లేదా లోటస్ పాండ్ లోనో నిర్వహించుకోండని ఫైర్ అయ్యారు.
కేవలం వైసీపీ కార్యకర్తలకే జాబ్ మేళాలు నిర్వహించి ఉపాధి కల్పిస్తే.. మిగతా నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? అని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులుంటే వారి గురించి ఆలోచించరా..? అని ప్రశ్నించారు. కేవలం ఎన్నికల్లో వైసీపీ తరపున ఓటర్లకు డబ్బులు పంచిన వాళ్లకు, ఎన్నికల వేళ పోలింగ్ బూతుల్లో గొడవలు చేసిన వారికి ఉధ్యోగాలివ్వటం ఏంటి? అని నిప్పులు చెరిగారు.