అమరావతి : ఇవాళ నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అయింది. ఇందులో భాగంగానే… పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సభ్యత్వ నమోదును లాంఛనంగా ప్రారంభించనున్నారు చంద్రబాబు, లోకేష్. వాట్సాప్ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది టీడీపీ.
అయితే.. తెలుగు దేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల ప్రమాద బీమా కూడా ఇవ్వనున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఇక ఇది ఇలా ఉండగా..సీఎం కాన్వాయ్ కోసం ఆర్టీఏ అధికారులు ఒంగోలులో ప్రజల కార్లు లాక్కెళ్ళడం రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు నిదర్శనమన్నారు. కుటుంబంతో తిరుమల దర్శనానికి వెళ్తున్న వినుకొండ వాసి వేముల శ్రీనివాస్ వాహనాన్ని రవాణా శాఖ అధికారులు బలవంతంగా తీసుకు వెళ్ళడం దారుణం అని పేర్కొన్నారు.
భార్యా, పిల్లలతో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డున దింపేసే హక్కు ఈ అధికారులకు ఎవరిచ్చారు? అనిఆగ్రహించారు. సీఎం కాన్వాయ్ కోసం కారు పెట్టుకోలేని స్థితికి రాష్ట్రం ఎందుకు వెళ్ళింది? ప్రభుత్వ అధికారులే ఇలాంటి చర్యలకు పాల్పడడం ద్వారా ప్రజలకు ఏమి చెప్పాలి అనుకుంటున్నారు? అని ఆగ్రహించారు. సీఎం వస్తే షాప్స్ మూసెయ్యడం.. సీఎం కాన్వాయ్ కోసం వాహనదారుల కార్లు లాక్కెళ్ళడం సిగ్గుచేటు అనిమండిపడ్డారు.