ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. శుక్రవారం రాత్రి నుంచి తెలుగు దేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి అసభ్యకరంగా మెసెజ్ లు వస్తున్నాయి. దీన్ని టీడీపీ ఐటీ విభాగం గుర్తించింది. వెంటనే అప్రత్తం అయింది. అయితే ప్రస్తుతానికి ఎలాంటి నష్టం జరగలేదని టీడీపీ ఐటీ విభాగం ప్రకటించింది. టీడీపీ ట్విట్టర్ ఖాతాను తిరిగి పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు టీడీపీ ఐటీ విభాగం తెలిపింది.
అలాగే టీడీపీ అధికార ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయినట్టు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా స్పందించాడు. తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని నారా లోకేష్ తెలిపారు. తెలుగు దేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను పురుద్ధరించేందుకు ట్విట్టర్ ఇండియాతో చర్చిస్తున్నట్టు నారా లోకేష్ ట్వీట్ చేశారు. కాగ టీడీపీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిన విషయాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు గమనించాలని ట్వీట్ లో పేర్కొన్నారు.
AWESOME! awxv
— Telugu Desam Party (@JaiTDP) March 18, 2022
Kindly note that our official party account @jaitdp has been hacked by nefarious elements. We are working with @TwitterIndia to restore the account.
— Lokesh Nara (@naralokesh) March 19, 2022