ఇండియాలో కరోన కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గతేడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరిలో దేశ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ వచ్చింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా రోజూవారీ కేసుల సంఖ్య లక్షల్లో నమోదైంది. ప్రస్తుతం మాత్రం గత కొన్ని రోజులుగా ఇండియాలో రోజూ వారీ కరోనా కేసుల సంఖ్య 5 వేలకు దిగువనే ఉంటుంది.
తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా కేవలం 2075 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య వందకు లేపే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో బాధపడుతూ…71 మంది మరణించారు. 3,383 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 27,802 యాక్టివ్ కేసులు ఉన్నాయి. డెయిలీ పాజిటివిటీ రేటు 0.56 శాతంగా ఉండగా… రికవరీ రేటు 98.73 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,24,61,926 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 5,16,352 మరణాలు నమోదయ్యాయి. దేశంలో అర్హులైన వారందరికి 1,81,04,96,924 డోసుల వ్యాక్సిన్ అందించారు. ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాక్సిన్ ను 12-14 ఏళ్ల పిల్లలకు అందిస్తున్నారు. రానున్న రోజుల్లో మరింతగా కరోనా కేసులు తగ్గే అవకాశం ఉంది.