గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం గురువారం సంచలన నిర్ణయం తీసుకుంది. పాఠశాలలో విద్యార్థులకు భగవద్గీత బోధించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని గుజరాత్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బీసీ నగేశ్ స్వయంగా ప్రకటించారు. నిపుణులతో చర్చించిన తర్వాతే.. ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. కాగ తాజా గా మరో రాష్ట్రం కూడా పాఠశాలలో భగవద్గీత ప్రవేశ పెట్టాలని భావిస్తుంది. కర్ణాటక లో ఉన్న బస్వరాజ్ బొమ్మై ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులకు భగవద్గీత బోధించాలని భావిస్తుంది.
ఈ విషయాన్ని ఆ రాష్ట్రానికి చెందిన ఒక మంత్రి ప్రకటించారు. అయితే దీనిపై పూర్తిగా చర్చించలేమని అన్నారు. దీని గురించి త్వరలోనే తమ రాష్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైతో చర్చిస్తామని తెలిపారు. కాగ నైతిక శాస్త్రం గురించి బోధించే సమయంలో భగవద్గీత పరిచయం చేయాలని ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. నైతిక శాస్త్రాన్ని మూడు లేదా నాలుగు దశలలో ప్రవేశ పెట్టాలని భావిస్తున్నారు. అయితే అందులో తొలి దశలోనే విద్యార్థులకు భగవద్గీతను బోధించాలని గుజరాత్, కర్ణాటక ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.