టీడీపీ-జనసేన పార్టీల పొత్తు విషయంలో అనేక ట్విస్ట్‌లు వచ్చేలా ఉన్నాయి…చెప్పడానికి వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చకూడదని చెప్పి…పవన్, టీడీపీతో పొత్తుకు రెడీ అయిన విషయం తెలిసిందే..అటు చంద్రబాబు సైతం పవన్‌ని కలుపుకుంటేనే జగన్‌కు చెక్ పెట్టడం సాధ్యమవుతుందని భావిస్తున్న విషయం తెలిసిందే…సరే ఏదైతే ఏమైంది గాని..టీడీపీ-జనసేనలు పొత్తుకు రెడీ అయిపోయాయి. అయితే పొత్తు కుదిరితే సరిపోదు…పొత్తు సెట్ అవ్వడానికి చాలా లెక్కలు ఉంటాయి…రెండు పార్టీల ఐడియాలజీ ఒకటే అవ్వాలి…రెండు పార్టీల నిర్ణయాలు ఒకటే అవ్వాలి..అలాగే సీట్ల పంపకాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్లాలి. అప్పుడే పొత్తుకు ఒక అర్ధం ఉంటుంది..అలా కాకుండా ఒకరు ఒక దారిలో, మరొకరు మరో దారిలో వెళితే ప్రయోజనం లేదు.
ఇప్పుడు సీట్ల విషయంలో అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది..అధికారికంగా సీట్ల విషయం ఇప్పుడు తేలదు..అలాగే చంద్రబాబు గాని, పవన్ గాని సీట్ల గురించి ఇప్పుడు ఆలోచించడం లేదు…ముందు జగన్ ప్రభుత్వంపై పోరాటం చేయాలనేది వారి టార్గెట్. అధినేతలు ఇలా ఆలోచిస్తుంటే, ఆ పార్టీ నేతలు ఇప్పుడే సీట్ల పంపకాలపై వాదోపవాదాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే జనసేన శ్రేణులు…పవన్‌కు సీఎం సీటు గాని లేదంటే 75 సీట్లు ఇవ్వాలని డిమాండ్లు చేస్తున్నారు.
అసలు సీఎం సీటు ఇచ్చే ప్రసక్తి లేదని, అవసరమైతే ఒంటరిగానే పోటీ చేస్తామని పొత్తు వద్దని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. 75 సీట్లు కూడా ఇచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. కుదిరితే ఓ 30 సీట్లు, 5 ఎంపీ సీట్లు ఇస్తామన్నట్లుగా టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి…కానీ దీనికి జనసేన శ్రేణులు ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు…తమకు పొత్తు అవసరం లేదని అంటున్నారు…అయితే ఈ సీట్ల పంపకాలు సోషల్ మీడియాలోనే జరుగుతున్నాయి..అధికారికంగా పార్టీల నుంచి ఎలాంటి ప్రకటనలు రావడం లేదు..కానీ పార్టీల కార్యకర్తలు మాత్రం సీట్ల పంపకాల గురించి చర్చలు చేసేస్తున్నారు. చూడాలి మరి చివరికి సీట్ల పంపకాలు ఏం అవుతాయో.