బ్యాటింగ్ బౌలింగ్ లో అదరగొట్టిన కోహ్లి సేన, రెండో వన్డేలో ఘనవిజయం…!

-

మూడు వన్డేల సీరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా తో రాజ్కోట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీం ఇండియా 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదటి వన్డేలో ఘోర ఓటమికి టీం ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. బ్యాటింగ్ బౌలింగ్ లో సమిష్టిగా రాణించి సిరీస్ ని 1-1 తో సమం చేసింది కోహ్లీ సేన. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు టీం ఇండియా బ్యాట్స్మెన్ చుక్కలు చూపించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మంచి ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్ కి 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

రోహిత్ శర్మ 44 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 42 పరుగులు చేసి జంపా బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యు గా అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ చాన్నాళ్ళ తర్వాత తనదైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. మూడో స్థానంలో వచ్చిన కెప్టెన్ కోహ్లీతో కలిసి వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారీ స్కోర్ కి బాటలు వేసాడు. 90 బంతుల్లో ఆరు 13 ఫోర్లు సిక్స్ సాయంతో 96 పరుగులు చేసి సెంచరి ముందు రిచర్డ్సన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ధావన్ అవుట్ తర్వాత స్కోర్ బోర్డు వేగం తగ్గింది.

ధావన్ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 17 బంతులు ఆడి కేవలం ఏడు పరుగులు చేసి అవుట్ కాగా, తొలి సారి అయిదో స్థానంలో వచ్చిన లోకేష్ రాహుల్ సత్తా చాటాడు. కేవలం 52 బంతుల్లో 80 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా నడిపించాడు. కోహ్లీ తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. మనీష్ పాండే రెండు పరుగులు చేసి అవుట్ అయినా ఆ తర్వాత వచ్చిన జడేజాతో కలిసి టీంకి మంచి స్కోర్ అందించాడు. దీనితో నిర్ణీత 50 ఓవర్లలో 340 పరుగుల స్కోర్ సాధించింది.

341 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. మొదటి వన్డేలో సెంచరీతో ఆకట్టుకున్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ కేవలం 15 పరుగులు చేసి శమి బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్, మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ తో కలిసి మ్యాచ్ ని నిలబెట్టే ప్రయత్నం చేసాడు. ఇద్దరు ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డు ని ముందుకి నడిపించారు. ఈ తరుణంలో జడేజా బౌలింగ్ లో కీపర్ కి క్యాచ్ ఇచ్చి ఫించ్ అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత లబూస్చాగ్నే తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. వీరిద్దరి భాగస్వామ్యం జట్టుని విజయం దిశగా తీసుకు వెళ్ళినా, లబూస్చాగ్నే జడేజా బౌలింగ్ లో 47 బంతుల్లో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్ 102 బంతుల్లో 9 ఫోర్లు ఒక సిక్స్ సాయంతో 98 పరుగులు చేసి సెంచరి ముందు అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ కీలక సమయంలో అవుట్ కావడంతో ఆస్ట్రేలియా ఓటమి లాంచనం అయింది. చివర్లో రిచర్డ్సన్ నాలుగు ఫోర్లు ఒక సిక్స్ సాయంతో మెరుపులు మెరిపించడంతో,

300 పరుగుల మార్క్ దాటింది. 49.1 ఓవర్లలో ఆస్ట్రేలియా 304 పరుగులకు ఆల్ అవుట్ అయింది. టీం ఇండియా బౌలర్లలో శమీ మూడు వికెట్లు తీయగా, సైనీ, జడేజా, యాదవ్ తలో రెండు వికెట్లు తీయగా బూమ్రా ఒక వికెట్ తీసాడు. ఆసిస్ బౌలర్లలో జంపా మూడు వికెట్లు తీయగా రిచర్జ్ద్సన్ రెండు వికెట్లు తీసాడు. ఇరు జట్ల మధ్య మూడో, నిర్ణయాత్మక వన్డే బెంగుళూరు లో జరగనుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ శిఖర్ ధావన్ కి దక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news