మహిళల టీ-20 ప్రపంచకప్లో భారత్ మరో విజయం నమోదు చేసింది. న్యూజిలాండ్ జట్టుపై భారత్ ఉత్కంట విజయం సాధించింది. ఈ టోర్నీ లో న్యూజిలాండ్ మహిళ జట్టు తొలి ఓటమి ఎదుర్కొంది. జంక్షన్ ఓవెల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. ఆ తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కీవీస్ జట్టు…
ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. భారత్ బౌలింగ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. 90 పరుగుల వద్ద ఐదు వికెట్లు కోల్పోయిన కివీస్ కి అమిలియా కెర్ర్ అండగా నిలిచి… విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో 19 బంతుల్లో 6 ఫోర్లతో 34 పరుగులు చేసింది. పూనమ్ యాదవ్ వేసిన 19వ ఓవర్లో నాలుగు ఫోర్లు, రెండు పరుగులతో మొత్తం 18 పరుగులు రాబట్టి గెలిపించినంత పని చేసింది.
కాని చివరి ఓవర్ భారత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో… భారత్ ఈ మ్యాచ్లో 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీనితో భారత్ సెమీఫైనల్ కి హర్మాన్ సేన దూసుకువెళ్ళి౦ది. భారత్ ఎక్కడిక్కడ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ కీలక సమయంలో వికెట్లు కోల్పోయింది. దీనితో ఒక్కసారిగా మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది. ఈ టోర్నీ లో ఇప్పటి వరకు టీం ఇండియా ఓటమి ఎదుర్కోలేదు.