టీమిండియా కు ఇప్పటి వరకు హెడ్ కోచ్ గా ఉన్న రవి శాస్త్రి ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే హెడ్ కోచ్ పదవీ కాలం ముగియడం తో రవి శాస్త్రి తప్పుకున్నాడు. అయితే రవి శాస్త్రి హెడ్ కోచ్ గా ఉన్న సమయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. అలాగే ఆయన టీమిండియా కు చేసిన సేవలను టీమిండియా మేనేజర్ సునీల్ సుబ్రమణ్యం గుర్తు చేసుకున్నాడు. టీమిండియా కు రవి శాస్త్రి హెడ్ కోచ్ గా ఉన్న సమయంలో 2017 లో శ్రీలంక టీమ్ భారత్ పర్యటన కు వచ్చింది.
ఈ సందర్భంగా ధర్మశాల వేదికగా వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో శ్రీ లంక చేతి లో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. దీంతో ఆటగాళ్లు తీవ్రం గా నిరాశకు గురి అయ్యారు. దీంతో టీమిండియా ఆటగాళ్ల ను ఉత్సహ పరిచేందుకు హెడ్ కోచ్ రవి శాస్త్రి కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆటగాళ్ల అందరితో అంత్యాక్షరీ ఆడించాడు. ఈ విషయాన్ని టీమిండియా మేనేజర్ సునీల్ సుబ్రమణ్యం తెలిపాడు. అయితే టీమిండియా ఆటగాళ్లు అంత్యాక్షరీ ఆడిన తర్వాత రెట్టింపు ఉత్సహంతో ఉన్నారని సునీల్ సుబ్రమణ్యం తెలిపాడు.