రాయల్ చాలెంజర్స్ బెంగళూరు లాంటి జట్లు ఎప్పటికీ కప్పు కొట్టలేవు: అంబటి రాయుడు

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో భాగంగా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచుల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కేవలం ఒక్క విజయాన్నే అందుకుంది. దీంతో మరోసారి ఆ జట్టు ప్రదర్శనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచల వ్యాఖ్యలు చేశారు.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు లాంటి జట్లు ఎప్పటికీ ట్రోఫీ గెలవలేవని భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. ‘రూ.కోట్లు వెచ్చించి తీసుకున్న ఆర్సీబీ స్టార్ ఆటగాళ్లు గ్రౌండ్లో కంటే డగౌట్లోనే ఎక్కువగా ఉంటున్నారు. ఇలా జరుగుతున్నంత కాలం ఆర్సీబీ రాత మారదు అని అన్నారు. అలాగే ఆ జట్టు బౌలర్లు ఎప్పుడూ అత్యధికంగా పరుగులు ఇస్తుంటారు. ఆర్సీబీ కష్టాల్లో ఉన్న సమయంలో ఒక్క స్టార్ ఆటగాడు కూడా రాణించడం నేను చూడలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా, నిన్న లక్నోతో మ్యాచులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. 153 రన్స్ మాత్రమే చేసి, ఆలౌటైంది. దీంతో లక్నో 28 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news