సంగారెడ్డి రియాక్టర్ పేలుడు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

-

భారీ అగ్ని ప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్ళి సహాయక చర్యలను పర్యవెక్షించాల్సిందిగా ఫైర్ సర్వీసెస్ డిజి నాగిరెడ్డిని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్, ఎస్పీని కోరారు.

కాగా, కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించి ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలైన ఘటన సంగారెడ్డి జిల్లా-హత్నూర మండల పరిధిలోని చందాపూర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చందాపూర్ పరిధిలోని ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు ఎగిరి పడిపోయారు. దీంతో వారి ప్రాణాలు గాలిలోనే కలిసిపోయాయి.పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కంపెనీ యాజమాన్యం సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో రియాక్టర్ కూడా పేలే అవకాశం ఉందని స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.దీంతో పరిశ్రమ పరిసర ప్రాంతాల ప్రజలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

Read more RELATED
Recommended to you

Latest news