మొబైల్స్ తయారీదారు టెక్నో భారత్‌లో స్పార్క్ 5 ప్రొ పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం విడుదల చేసింది. స్పార్క్ సిరీస్‌లో వచ్చిన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో 6.6 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియో ఎ25 ప్రాసెసర్‌ను అమర్చారు. వెనుక భాగంలో 16 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్‌లు ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సాన్ వెనుక భాగంలో ఉంది. డెడికేటెడ్ డ్యుయల్ సిమ్, మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్లను ఇందులో ఏర్పాటు చేశారు. 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇందులో అందిస్తున్నారు.
టెక్నో స్పార్క్ 5 ప్రొ స్పెసిఫికేషన్లు…
* 6.6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ఎ25 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
* 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10, డ్యుయల్ సిమ్
* 16, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాలు
* ఫింగర్ ప్రింట్ సెన్సార్, డీటీఎస్ హెచ్‌డీ సరౌండ్ సౌండ్
* 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
టెక్నో స్పార్క్ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్ ఐస్ జేడియట్, స్పార్క్ ఆరెంజ్, సీబెడ్ బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. దీన్ని రూ.10,499 ధరకు అమెజాన్ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. రిటెయిల్ స్టోర్స్‌లోనూ ఈ ఫోన్ లభిస్తోంది.