ట్రాన్సిషన్ ఇండియా కంపెనీ టెక్నో స్పార్క్ 6 ఎయిర్ పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను గురువారం భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 7 ఇంచుల భారీ డిస్‌ప్లేతోపాటు 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఇతర పలు ఆకట్టుకునే ఫీచర్లను కూడా ఇందులో అందిస్తున్నారు.
టెక్నో స్పార్క్ 6 ఎయిర్ స్పెసిఫికేషన్లు…
* 7 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1640 X 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ఎ25 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
* 1టీబీ వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10
* డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
* 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్
* ఫేస్ అన్‌లాక్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
టెక్నో స్పార్క్ 6 ఎయిర్ స్మార్ట్‌ఫోన్ కోమెట్ బ్లాక్, ఓషియన్ బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా.. ఈ ఫోన్‌ను రూ.7,999 ధరకు అమెజాన్‌లో ఆగస్టు 6 నుంచి విక్రయించనున్నారు.