ఆ సినిమాతో హనుమాన్ ని పోల్చినందుకు.. తేజ సజ్జా ఎలా రియాక్ట్ అయ్యారంటే..?

-

హీరో తేజ సజ్జ హనుమాన్ సినిమాతో సంక్రాంతికి వస్తున్నారు హనుమాన్ సినిమా కూడా హిట్ అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. యంగ్ హీరో తేజ నటించిన ఈ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. చాలా రోజుల నుండి మంచి సినిమాతోనే ఎంట్రీ ఇవ్వాలని ఎదురుచూస్తున్నానని.. హీరోగా నన్ను చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇంట్లో వాళ్ళు సినిమాని వదిలిపెట్టేయమని సలహా ఇచ్చారని తేజ చెప్పారు. ఓ బేబీ సినిమాతో కల నెరవేరింది అని తేజ కామెంట్స్ చేశారు.

HanumanTrailer out now

నితిన్ హీరోగా శ్రీ ఆంజనేయం సినిమా వచ్చింది అయితే శ్రీ ఆంజనేయం సినిమాతో హనుమాన్ సినిమాని పోలిస్తున్నారని రెండు స్టోరీస్ కూడా ఒకటేనని అంత అంటున్నారని తేజ ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు. శ్రీ ఆంజనేయం సినిమా కథకు హనుమాన్ సినిమా కథకు ఎటువంటి పోలిక లేదని చెప్పారు. శ్రీ ఆంజనేయంలో నితిన్ పక్కన అర్జున్ రూపంలో ఆంజనేయస్వామి ఉంటారని కానీ హనుమాన్ ఆంజనేయుడు క్యారెక్టర్ కనిపించదని తేజ తెలిపారు. స్పైడర్ మాన్ తరహాలో సూపర్ హీరో కథతో హనుమాన్ సినిమా అని తీసుకువచ్చినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version