ఇటీవలే బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీహార్ రాజకీయాల్లో రాజుకున్న వేడి ఇప్పటికికూడా తగ్గడం లేదు. ముఖ్యంగా ప్రతిపక్షనేత తేజస్వి యాదవ్ అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంత్రివర్గంలోని ఒక్కొక్క మంత్రి ని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు ఆయా మంత్రులపై గతంలో ఉన్న ఆరోపణలు కూడా తెరమీదికి తెస్తున్నారు. దీంతో ప్రస్తుతం బీహార్ రాజకీయాలు వాడివేడిగా మారిపోయాయి.
ఇటీవలే మేవాలాల్ చౌదరి ని టార్గెట్ చేస్తూ సంచలన విమర్శలు చేయాగా.. ఇక ఇప్పుడు మరో మంత్రి అశోక్ చౌదరి ని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ఎంతో ఆప్తుడైన అశోక్ చౌదరి కుటుంబం పైన ఎన్నో రకాల ఆరోపణలు ఉన్నాయి అంటూ ఆరోపించిన తేజస్వి యాదవ్ బ్యాంకులో లోను తీసుకుని కోట్ల రూపాయలు మోసం చేశారని అంతేకాకుండా దొంగతనాలకు పాల్పడ్డారని ఇలా ఎన్నో రకాల ఆరోణపణలు ఉన్నాయని ఈ కేసుపై సిబిఐ దర్యాప్తును కూడా కొనసాగుతుందని… అయినప్పటికీ ఇది తప్పు కాదు అన్నట్లుగా జెడియు వ్యవహరిస్తుందని… ఇది జెడియు నిజాయితీ అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు తేజస్వి యాదవ్.