లాక్ డౌన్ కోసం తెలంగాణా పోలీసుల సరికొత్త నిర్ణయం…!

-

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనితో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని కొనసాగిస్తున్నారు. ఇక చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ని కొనసాగించడానికే మొగ్గు చూపిస్తున్నాయి. తెలంగాణా సర్కార్ ఇప్పటికే ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ ని ప్రకటించింది. దీనితో ఇప్పుడు పోలీసులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేయడానికి పూర్తిగా సిద్దమైంది తెలంగాణా పోలీస్.

ఇది పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణాలో లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేయడానికి డ్రోన్ లను వినియోగించాలని భావిస్తున్నారు. డ్రోన్ ల ద్వారా ప్రజల కదలికలను తెలుసుకోవాలి అని భావిస్తున్నారు. డ్రోన్ ల ద్వారా ఎక్కువగా ఎక్కడ ప్రజలు గుమి గూడుతున్నారో వారిని గుర్తించి అక్కడ భారీగా పోలీసులను మొహరించాలి అని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇదే యోచనలో ఉన్నారు పోలీసులు.

హైదరాబాద్ లో మూడు కమీషనరేట్ ల పరిధిలో దీన్ని అమలు చెయ్యాలని చూస్తున్నారు. ఇక ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, సిద్ధిపేట, మెదక్, నిర్మల్ ఇలా దాదాపు అన్ని ప్రాంతాల్లో దీన్ని కఠినం గా అమలు చెయ్యాలని భావిస్తున్నారు. కేరళ పోలీసులు దీన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. అందుకే వారి సలహాలను తీసుకుని దీన్ని రాష్ట్రంలో తీసుకుని రావాలని భావిస్తూ ఇప్పటికే డ్రోన్ లను కొనుగోలు కూడా చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news