హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి విడుదల చేశారు. టెన్త్ ఫలితాల్లో జగిత్యాల మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ చివరి స్థానాన్ని సాధించింది. 92.43 శాతం విద్యార్థులు ఈసారి ఉత్తీర్ణత సాధించారు.
వీరిలో బాలికల ఉత్తీర్ణత శాతం 93.68 కాగా.. బాలుర ఉత్తీర్ణత శాతం 91.18 శాతం నమోదైంది. పదో తరగతి పరీక్షలకు 5,52,280 మంది విద్యార్థులు నమోదు చేసకోగా.. 5,46,728 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 5,06,202 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జూన్ 10 నుంచి టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఫలితాలను www.ntnews.com లింక్ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.