పోలవరం ప్రాజెక్టుపై ఉమ్మడి సర్వే చేయాలన్న తెలంగాణ విజ్ఞప్తికి ఏపీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని కేంద్ర జలసంఘం తెలిపింది. ఈ ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిమట్టంతో ఉత్పన్నమయ్యే ప్రభావాలపై ఉమ్మడి సర్వే చేయాలని ఏపీని తెలంగాణ కోరిన విషయం తెలిసిందే. ఈ సర్వే ఫలితాల ఆధారంగా అవసరమైన చర్యలను పోలవరం ప్రాజెక్టు అథార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొంటాయని కేంద్రం పేర్కొంది.
పోలవరం పూర్తిస్థాయి నీటిమట్టమైన 150 అడుగులకు నింపినపుడు తెలంగాణలో ముంపు, బ్యాక్‌వాటర్ ప్రభావం, తాజాగా ప్రజాభిప్రాయసేకరణ, స్థానిక వాగుల్లో నీరు నిల్వ ఉండటం వల్ల డ్రెయినేజి సమస్య, మణుగూరు హెవీ ప్లాంట్‌పై ప్రభావం తదితర అంశాలను తెలంగాణ లేవనెత్తింది.
ఎగువ రాష్ట్రాలకు నిజమైన సమస్యలు ఏమైనా ఉంటే పరిగణనలోకి తీసుకొంటామని, పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడానికి సహకరించాలని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా అభిప్రాయాలను విన్న తర్వాత సంయుక్త సర్వేకు సమ్మతిని తెలియజేసినట్లు జలసంఘం ఛైర్మన్ పేర్కొన్నారు’’