హైదరాబాద్‌లో ఉద్రిక్తంగా మారిన ఆర్టీసీ బంద్‌

-

ఆర్టీసీ కార్మికులు 15 రోజులుగా చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈరోజు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్త బంద్‌ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు బంద్‌లో పాల్గొంటున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే హైదరాబాద్‌లో ఆర్టీసీ బంద్‌ ఉద్రికంగా సాగుతోంది. రాణిగంజ్‌లో బస్సులు డిపోకే పరిమితయ్యాయి. పోలీసుల పహారా మధ్య బస్సులను బయటకు తీసుకువచ్చేందుకు యత్నించగా ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు.

 

దీంతో పోలీసులు, కార్మికుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతరం ఆందోళనకారులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఎంజీబీఎస్ దగ్గర ఉద్రిక్తతనెలకొన్నది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా బంద్ లోపాల్గొన్న కార్మిక సంఘాలు, వామపక్షాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news