రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఉభయసభల సభాపతులు ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఎల్లుండి నుంచి సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో సంబంధిత అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి ప్రశాంత్ రెడ్డి అధికారులతో సమావేశం కానున్నారు.
సభ్యుల ప్రశ్నలు, శూన్యగంట తదితరాలకు సమాధానాలు, సంబంధిత అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్శి శేషాద్రి తదితరులతో సమీక్షిస్తారు. సమావేశాల సందర్భంగా భద్రతా పరమైన ఏర్పాట్లపై డీజీపీ అంజనీ కుమార్, పోలీసు అధికారులతో సమావేశమై చర్చిస్తారు.