తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్ పార్టీకి లేదని…తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెప్పిన కేసీఆర్ మోసం చేశారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణపై నిర్ణయం తీసుకోకపోతే కేసీఆర్ ముడ్డి రాసుకుంటూ ఢిల్లీకి వెళ్లిన తెలంగాన వచ్చేది కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ వరి వేసుకుంటే ఉరి అని చెప్పిందని.. కాంగ్రెస్ పార్టీ రైతులకు విశ్వాసం కలిగించేలా చేస్తుందని…అందుకే రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారని పొన్నం ప్రభాకర్ అన్నారు.
తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనం చేస్తామని కేసీఆర్ మోసం చేశాడు: పొన్నం ప్రభాకర్
-