తెలంగాణలో కొత్తగా 2,278 కేసులు..!

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. కాగా, గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 2,278 మంది కరోనా బారినపడగా, మొత్తం కేసుల సంఖ్య 1,54,880 కు పెరిగింది. క‌రోనాతో నిన్న కొత్తగా 10 మంది చ‌నిపోగా, మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 950 కు చేరింది.

corona

తాజాగా 2,458 మంది కోలుకోవ‌డంతో మొత్తం కోలుకున్న‌వారి సంఖ్య 1,21,925 కు చేరింది. ఇందులో 32,005 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా సోకిన మరో 25,050 మంది హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యశాఖ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. అయితే కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీలో అధికంగా 331 కేసులు నమోదు అయ్యాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల్లో 62,234 టెస్టులు జరగగా.. ఇప్పటి వరకు 20,78,695 టెస్టులు జరిగాయి.