తెలుగుదేశం పార్టీకి సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో మరో దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, అటవీశాఖ మాజీ డైరెక్టర్ మారుతీ వరప్రసాద్ కన్నుమూశారు. ప్రస్తుతం మారుతీ వరప్రసాద్ పులివెందులలో టీడీపీకి కీలక నేతగా ఉన్నారు. ఆయన మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీమంత్రి నారా లోకేష్, టీడీపీ నేతలు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు.. పులివెందుల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అటవీశాఖ మాజీ డైరెక్టర్ మారుతీ వరప్రసాద్ గారు మరణించడం బాధాకరం.
పులివెందుల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అటవీశాఖ మాజీ డైరెక్టర్ మారుతీ వరప్రసాద్ గారు మరణించడం బాధాకరం. ప్రసాద్ గారి ఆకస్మిక మరణం పార్టీకి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడుని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాను. pic.twitter.com/1UKl6iLVd2
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) September 11, 2020
ప్రసాద్ గారి ఆకస్మిక మరణం పార్టీకి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడుని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాను అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. కాగా, కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, టీడీపి సీనియర్ నేత చలమలశెట్టి రామానుజయ కూడా కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతికి కూడా అధినేత సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. గంటల వ్యవదిలో ఇద్దరు నేతలు మరణించడంతో ఆ పార్టీలో విషాదఛాయలు అలుముకున్నాయి.