తెలంగాణలో శాంతించిన కరోనా.. 24 గంటల్లో 220 కేసులు

తెలంగాణ రాష్ట్రం లో కరోనా మహమ్మారి పూర్తిగా శాంతించింది. తాజా గా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 220 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 6,66, 183 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు 3919 మంది కరోనా మహమ్మారి తో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసులు 4599 గా ఉన్నాయి.

ఇక ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 6,57 ,665 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. గత 24 గంటల్లో 244 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 98.72 శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 97.83 శాతంగా ఉంది. తెలంగాణలో మరణాలు 0.58% గా ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 46, 193 పరీక్షలు చేశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పరీక్షలు సంఖ్య 2,64,25, 728 కు చేరుకుంది. ఇక జీహెచ్‌ ఎంసీ పరిధిలో గడిచిన 24 గంటల్లో 67 కరోనా కేసులు నమోదయ్యాయి.