బద్వేల్ స్పెషల్: జారుడు బల్లపై కాంగ్రెస్ విన్యాసాలు ఆగుతాయా?

-

ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్న పరిస్థితి. తెలంగాణలో రేవంత్ దూకుడుతో అక్కడ కాంగ్రెస్ పార్టీలో కదలికలు వచ్చినా… ఏపీలో మాత్రం కాస్తంత కదలిక కూడా లేకుండాపోయిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏపీలో ఉప ఎన్నిక వచ్చింది. అది కూడా కాంగ్రెస్ మాజీ సీఎం వైఎస్సార్ జిల్లాలో!

congress
congress

రాష్ట్ర విభజన ఎఫెక్ట్ తో ప్రాభవం కోల్పోయిన కాంగ్రెస్… ఏపీలో ఇప్పటికీ జారుడు బల్లపై విన్యాసాలు చేస్తూనే ఉంది. గతంలో జరిగిన నాలుగు ఎన్నికలను చూస్తే.. 2004 – 2009 ఎన్నికల్లోల కాంగ్రెస్ విజయం సాధించింది. వైఎస్సార్ కష్టంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే… 2014 – 2019 ఎన్నికల్లో మాత్రం పరాజయం పాలైంది. అప్పటి అధ్యక్షుడు రఘువీరారెడ్డి సైతం డిపాజిట్ దక్కించుకోలేక పోయిన పరిస్థితి దాపురించింది.

అయితే… ఇప్పుడు పరిస్థితి మారింది.. గెలుస్తాం.. నిలుస్తాం.. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని తిరిగి ఘర్వాపసీ కార్యక్రమం ద్వారా వెనక్కి తీసుకువస్తాం అంటూ చెప్పుకుంటున్నా… చేతల్లో మాత్రం అది ఎక్కడా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని ఇప్పటికీ తమ నాయకుడేనని.. ఆయన పెట్టిన పథకాలనే జగన్ కాపీ కొడుతున్నారని.. వైఎస్ ఇమేజ్ అంతా కాంగ్రెస్ కే దగ్గుతుందని.. పదే పదే చెప్పే ఏపీ కాంగ్రెస్ నాయకులు. ఆ విషయాన్ని క్యాష్ చేసుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు.

వైఎస్సార్ ని కాంగ్రెస్ లీడర్ గా చూపించే ప్రయత్నాలు చేయాలంటే… ఆయన సొంత జిల్లా కడపలో వచ్చిన బద్వేల్ ఉప ఎన్నిక విషయాన్ని ఏపీ కాంగ్రెస్ నేతలు సీరియస్ గా తీసుకోవాలి. కానీ.. ఆ ఉప ఎన్నికను వారు పెద్దగా పట్టించుకోకపోవడం లేదు! నోటిఫికేషన్ విడుదలయ్యేందుకు సమయం దగ్గరకు వచ్చినా.. కాంగ్రెస్ నేతలు ఇప్పటి వరకుదీనిపై కనీసం దృష్టిపెట్టలేదు. ఫలితంగా… జారుడు బల్లపై విన్యాసాలను కాంగ్రెస్ పార్టీ ఇంకా మానలేదని.. పుంజుకోవాలనే ఆలోచన చేయడం లేదని అంటున్నారు విశ్లేషకులు!

Read more RELATED
Recommended to you

Latest news