దీపావళి పండుగ సందర్భంగా తెలంగాణాలో క్రాకర్స్ ను బ్యాన్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు లో తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ లంచ్ పిటీషన్ దాఖలు చేసింది. దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్స్ ను బ్యాన్ చేస్తూ హైకోర్టు తీర్పు పై స్టే ఇవ్వాలని తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ కోరింది. ఇప్పటికే షాపులలో స్టాకులను నింపామని, పండుగ రెండు రోజుల ముందు బ్యాన్ విధిస్తే తాము కోట్లల్లో నష్టపోతామని పిటీషన్ లో పేర్కొన్నారు.
ఈ రోజు ఉదయం హైకోర్టు ఆదేశాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం విధించిన బ్యాన్ ను ఎత్తివేయాలని సుప్రీంకోర్టుని పిటీషనర్ కోరారు. హైకోర్టు తీర్పు వల్ల చాలా మంది ఆత్మహత్య లు చేసుకుంటారని కూడా పిటీషనర్ పిటీషన్ లో పేర్కొన్నారు. షాప్ లకు అన్ని అనుమతులు ప్రభుత్వం ఇచ్చిన తరువాత ఇప్పుడు బ్యాన్ అంటే స్టాక్ ను అంతా ఎక్కడ పెట్టాలని ? ప్రశ్నించారు. ఇక ఈరోజు ఈ లంచ్ మోసహన్ పిటీషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనున్నారు.