తెలంగాణ డిజిపిని కూడా ఏపీ కేడర్ కు కేటాయించాలి – ఎమ్మెల్యే రఘునందన్

-

మాజీ సిఎస్ రమేష్ కుమార్ తరహా లోనే తెలంగాణ డిజిపిని కూడా ఏపీ కేడర్ కు కేటాయించాలని డిమాండ్ చేశారు బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు. తెలంగాణలో కొనసాగుతున్న ఏపీకే లీడర్ కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడుతూ.. సిఎస్ సోమేశ్ కుమార్ తరహా లోనే కొందరు ఉన్నతాధికారులు సొంత క్యాడర్ లో కాకుండా తెలంగాణలో కొనసాగుతున్నారని ఆరోపించారు.

అలాంటి అధికారులు తెలంగాణ డిజిపి కూడా ఉన్నారని, ఆయనని వెంటనే ఏపీ కేడర్ కు బదిలీ చేయాలని కోరారు. ఉన్నత సర్వీసులు అధికారులు ఎక్కడ పోస్టింగులు లభిస్తే అక్కడికి వెళ్లి పనిచేయాల్సి ఉంటుందని, సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని చెబుతుందన్నారు. కానీ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (CAT) నిర్ణయంతో 15 మందిని సొంత క్యాడర్ కు పంపకుండా అడ్డుకున్నారని, ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news