రేపే తెలంగాణ ఈ సెట్ ఫలితాలు

తెలంగాణ రాష్ట్ర  ఈ-సెట్ పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 11 గంటల సమయంలో…. తెలంగాణ ఈ సెట్ ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ఈసెట్ – 2021 కన్వీనర్ సిహెచ్ వెంకట రమణ రెడ్డి డి ఓ ప్రకటన చేశారు.

జెఎన్టియు హైదరాబాద్ క్యాంపస్ లోని యూజీసీ – హెచ్ ఆర్ డి సి ఆడిటోరియం లో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపి రెడ్డి మరియు జె ఎన్ టి యు ఉపకులపతి కట్ట నరసింహారెడ్డి… తెలంగాణ ఈ సెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. అధికారిక వెబ్ సైట్ ecet tsche.ac.in నుంచి విద్యార్థులు తమ ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. దీనిపై ఎలాంటి సమస్యలు ఉన్నచో…. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ద్వారా ఫిర్యాదులు అందించవచ్చని స్పష్టం చేశారు. కాగా గత నెలలో తెలంగాణ రాష్ట్ర  ఈ-సెట్ పరీక్ష ఫలితాలు జరిగిన సంగతి తెలిసిందే.