పాఠశాలల్లో పెరుగుతున్న కరోనా..తెలంగాణ విద్యాశాఖ కీలక ఆదేశాలు

-

తెలంగాణ రాష్ట్రంలోని చాలా పాఠశాలల్లో కరోనా మహమ్మారి కేసులు పెరిగిపోతున్నాయి. అయితే… విద్యా సంస్థల్లో కరోనా మహమ్మారి కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో అధికారులతో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. అంతేకాదు… ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి. కరోనా వైరస్‌ పట్ల…. చాలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏ విద్యా సంస్థల్లో నైతే కోవిడ్ కేసులు నమోదయ్యాయో…. అక్కడ విద్యార్థులందరికీ స్క్రీనింగ్ చేయాలని పేర్కొన్నారు.

విద్యాసంస్థల్లో కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి. కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అ శ్రద్ధ గా ఉండకూడదని వెల్లడించారు. శానిటైజర్ లు వాడాలి ధర్మ స్క్రీనింగ్ చేయాలి… పనిచేస్తున్న సిబ్బంది రెండు డోస్ లు టీకా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి. ఇది ఇలా ఉండగా… కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్’ ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి , టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల కోసం….క్యాబినెట్ సబ్ కమిటీని నియామకం చేశారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news