ఈ నీటిలో పడితే వెంటనే రాయిలా అయిపోతారట..! టెస్టింగ్ కోసం ఏకంగా..

-

అడ్వెంచర్స్ అన్నీ సినిమాల్లోనో, కథల్లోనో సాధ్యమవుతాయి..నిజంగా ఇవి జరిగితే భలే ఉంటుంది అని మనకూ అప్పడప్పుడూ అనిపిస్తుంది కదా..జై బజరంగభళి సినిమా మీరు చూశారా..చూస్తే అందులో రాజేంద్రప్రసాద్ ఓ బావిలో పడగానే..ఐరమ్ మ్యాన్ లా అయిపోతాడు..అలా బయట కూడా జరిగితే..అవును అలాంటి జలపాతం ఒకటి ఉంది. అయితే ఐరన్ లా కాదు..గట్టిగా బిగుసుకుపోతారు. ఏ వస్తువు వేసినా సరే ఇనుములా అయిపోతుందట. ఏంటి ఇలాంటి జలపాతం ఉంటుందా అనే సందేహం వస్తుంది కదూ..నిజమండి..ఉంది.దాని గురించి పూర్తివివరాలు మీకోసం.!

ఇంగ్లాండ్‌లోని మదర్ షిప్టాన్స్‌ కేవ్‌ అని ఓ జలపాతం ఉంది. దీనిని డ్రాపింగ్ వెల్ అని కూడా పిలుస్తారు. దీనిని 1630లో మొదటిసారిగా ప్రజల సదర్శన కోసం తెరిచారట. వందల సంవత్సరాలుగా ఈ ప్రదేశానికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు..ఇక్కడి నీటి బుగ్గ నుండి బయటికి ఉబికి వచ్చే నీళ్లు జలపాతంలా కిందికి జారుతూఉంటాయి. ఐతే ఈ నీళ్లలో ఏవస్తువునైనా ఉంచితే అది వెంటనే రాయిలా గట్టిపడిపోతుంది. దీనిని చూడటానికి వచ్చే సందర్శకులకు.. పొరపాటున జారి ఈ నీళ్లలో పడితే మేముకూడా రాయిలా అయిపోతామేమోననే భయం వాళ్లలో ఉంటుంది.

ఈ నీటిబుగ్గ గురించి స్థానికంగా ఓ పురాణ కథ కూడా ప్రచారంలో ఉంది. అదేంటంటే…మదర్ షిప్టాన్ అనే బాలిక ఓ వేశ్యకు ఈ గుహలో జన్మించిందట. ఐతే ఆమె వికృత రూపాన్ని చూసిన ఆ ప్రాంత ప్రజలు దెయ్యమని అక్కడి నుంచి వెళ్లగొట్టారట. ఆమె వేశ్య కుమార్తె రూపంలో వచ్చిన పురాతన చెడుకు నిలయంగా అక్కడి ప్రజలు చెబుతుంటారు.

సైన్స్‌ రహస్యమేమంటే..

ఇక్కడి నీటి బుగ్గ నుంచి వెలువడే నీటి లక్షణాల వల్లనే వస్తువులు రాయిలా మారిపోతున్నాయి. ఈ స్ప్రింగ్ నుండి వచ్చే నీటిలో పెద్ద మొత్తంలో కరిగే సున్నపురాయి ఉండటంతో.. ఈ నీరు దేనినైనా తాకినప్పుడు, సున్నపురాయి నిక్షేపాలు వాటిపై ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఇక ఎక్కువకాలం ఈ నీటిలో ఉంచితే సున్నపురాయి నిక్షేపాలు పొరలా ఏర్పడి ప్రతి వస్తువును రాయిగా మారుస్తుంది. సందర్శనకు వచ్చిన ప్రజలు ఊరికే ఎందుకు ఉంటారు..టెస్ట్ చేయాలిగా.. దశాబ్దాలుగా సున్నపురాయి అధికంగా ఉన్న ఈ నీటిలో వస్తువులను వేలాడదీస్తున్నారు. 1850లో వేలాడదీసిన టోపీలు ఈ నాటికీ ఉన్నాయక్కడ. ఓ వ్యక్తి అయితే ఏకంగా ఈ నీటిలో సైకిల్‌ పెట్టాడు.

లైమ్‌ స్టోన్‌లో చాలామంది టెడ్డీబేర్‌లను కూడా వేలాడదీస్తారు. వేల సంవత్సరాలుగా నీటి తాకిడికి గురైన ఈ కొండ ఇలా గోడలా రూపొందింది.

భూమిపై ఇలాంటివి ఉండటం నిజంగా మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందనే చెప్పాలి. ఇంగ్లండ్‌కు వెళ్లితే ఆ మ్యాజికల్‌ వాటర్‌ ఫాల్‌ చూడటానికి ట్రై చేయండి మరీ..!

Read more RELATED
Recommended to you

Latest news