వినూత్న పథకాలతో ప్రగతిపథంలో దూసుకెళ్తోంది తెలంగాణ. ఇప్పటికే అనేక రకాల సంక్షేమ పథకాల అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచింది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇంగ్లీష్ మీడియం మాధ్యమంలో తరగతులను ప్రణాళికబద్ధంగా ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధించనుండగా.. ఒకే పుస్తకం తెలుగు, ఇంగ్లీష్ పాఠాలు ఉంటాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అధ్యక్షతన సమావేశమై ఈ కేబినెట్ సబ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ప్రైవేట్ స్కూళ్లో ఫీజుల నియంత్రణపై కూడా చర్చించింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులపై నియంత్రణ లేదు. దీనిపై కూడా కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. రానున్న రోజుల్లో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను నియంత్రించేలా చర్చలు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.