ఆపరేషన్ గంగా: వచ్చే 24 గంటల్లో 15 విమానాలు… ఉక్రెయిన్ లోని విద్యార్థులు మరింత వేగంగా ఇండియాకు

-

‘ఆపరేషన్ గంగా’ను మరింత వేగవంతం చేసింది భారత ప్రభుత్వం. మూడు రోజుల్లో 26 విమానాల ద్వారా భారతీయ విద్యార్థులను ఇండియాకు చేర్చనున్నారు. దీనికి తోడు ఇండియన్ ఏయిర్ ఫోర్స్ కు చెందిన సీ -17 విమానాల ద్వారా కూడా భారతీయులను తరలించనున్నారు. ఉక్రెయిన్- రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన విద్యార్థులను మరింత వేగవంతంగా ఇండియాకు తీసుకువచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. వచ్చే 24 గంటల్లో 15 విమానాల ద్వారా భారతీయ విద్యార్థులను ఇండియాకు తీసుకురానున్నారు. 

ఇప్పటికే 17000 మంది విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి బయటపడ్డారని విదేశాంగ శాఖ తెలిపింది. మరోవైపు ఖార్కీవ్ నగరాన్ని విడిచిపెట్టి రావాలంటూ భారతీయుకు విదేశాాంగ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. బస్సులు, కార్లు ఇవేవీ కుదరకుంటే కాలినడకతో అయినా.. ఖర్కీవ్ ను ఖాళీ చేయాలని భారతీయ విద్యార్థులకు సూచనలు జారీచేసింది. హంగేరీ బుడాపెస్ట్ నుంచి, రోమేనియా బుకారెస్ట్ నుంచి, స్లోవేకియా, పోలాండ్ దేశాల నుంచి విద్యార్థులను తరలిస్తున్నారు. ప్రత్యేకంగా నలుగురు కేంద్ర మంత్రులు ఈ తరలింపును పర్యవేక్షిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news