Telangana : గ్రూప్-1 దరఖాస్తుల గడువు పెంపు…

-

రాష్ట్రంలో కొత్తగా 60 పోస్టులను కలిపి 563 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా TSPSC కీలక నిర్ణయం తీసుకుంది.కాగా, మార్చి 14వ తేది సాయంత్రం 5 గంటలకు గ్రూప్-1 దరఖాస్తుల గడువు ముగియ నుండగా, తాజాగా ఆ గడువును మరో రెండు రోజులు పొడిగించింది. ఇక ఇప్పటివరకు 2.7 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే గతంతో పోలిస్తే ఈసారి అప్లికేషన్ల సంఖ్య భారీగా తగ్గడం గమనార్హం.

 

అర్హత గల అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.గ్రూప్‌ -1 పరీక్షల కోసం ఇప్పటివరకు 2.7లక్షల అప్లికేషన్స్ వచ్చాయి.పరీక్షకు 7 రోజుల ముందు నుంచి హాల్‌ టికెట్లు అందుబాటులోకి వస్తాయి.కాగా…..2022 ఏప్రిల్ లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసిన సంగతి తెలిసిందే.అయితే పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా పడితే.. మరొకసారి నిబంధనలు సరిగ్గా పాటించలేదని రెండోసారి కూడా ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేశారు.కొత్త అభ్యర్థులతో పాటు గత నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్నవారు కూడా మళ్లీ అప్లై చేసుకోవాల్సి ఉంటుందని TSPSC పేర్కొంది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజు నుంచి మినహాయింపు కల్పించింది.

Read more RELATED
Recommended to you

Latest news