సౌతిండియాకు తెలంగాణ గేట్ వే: రాజ్‌నాథ్ సింగ్

-

సౌత్ ఇండియాకి తెలంగాణ ‘గేట్ వే’ లాంటిదని, ఇక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పడి స్థిరమైన అభివృద్ధి జరిగితే ప్రజలకు మేలు జరుగుతుందని డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా కిషన్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరు అయినారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణ ప్రాంతం ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవిస్తే అభివృద్ధి జరుగుతుందన్న ఉద్దేశంతో అప్పట్లో బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు పలికిందని, కానీ 10 సంవత్సరాల పాటు పాలన సాగించిన బీఆర్ఎస్ చివరకు ప్రజా ధనాన్ని లూటీ చేసిందని మండిపడ్డారు.

మోడీ హయాంలో ఒక్క అవినీతి కూడా జరగలేదని, యావత్తు ప్రజానీకం కేంద్ర ప్రభుత్వంవైపు చూశారని, అభివృద్ధిలో రోల్ మోడల్‌గా నిలిచిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మోడీ పాలన గుర్తింపు తెచ్చుకున్నదన్నారు రాజ్‌నాథ్ సింగ్. వచ్చే ఐదు సంవత్సరాలలో ఇండియా బలమైన ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని, ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఎకనామీ కలిగిన దేశంగా తయారవుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news