కాంగ్రెస్ తప్పిదాల వల్లే నీటి ఇబ్బందులు : జగదీష్ రెడ్డి

-

కాంగ్రెస్ ప్రభుత్వం నీటి వనరుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు కృష్ణా టెయిల్ పాండ్ నీటి విషయంపై మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… నల్గొండ దాహార్తిని , ఆపద కాలంలో విద్యుత్ అవసరాన్ని తీర్చే టెయిల్ పాండ్ ఆధారాన్ని దొంగతనంగా ఖాళీ చేస్తే జిల్లా మంత్రులకు సోయిలేదని విమర్శించారు.

కాంగ్రెస్ తప్పిదాల వల్లే నీటి ఇబ్బందులు వచ్చాయని మండిపడ్డారు .నల్గొండ జిల్లాను ఏడారిగా మార్చే కుట్ర జరుగుతోందని ,గత 60 ఏళ్లు కృష్ణా జిల్లాల్లో మన హక్కులను కొట్లాడక జిల్లాను కరువు కొరల్లోకి నెట్టారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. హామీలకు మొసపోయి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి ప్రజలు ఓటేశారని.. కానీ ఈ ప్రభుత్వం మత్తునిద్రలో ఉందని అన్నారు.టెయిల్ పాండ్ నీటి చౌర్యానికి జిల్లా మంత్రులు, రేవంత్ రెడ్డి బాధ్యులు కాదా అని ఆయన ప్రశ్నించారు.నీటి చౌర్యంపై విచారణ చేసి ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు

.

Read more RELATED
Recommended to you

Latest news