1,677 డాక్టర్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి

-

తెలంగాణ గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లోని పల్లె దవాఖానాల్లో ఏకంగా 1677 మంది డాక్టర్ల నియామకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది కేసీఆర్‌ సర్కార్‌. దీనికి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ తాజాగా మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. అక్టోబర్‌ చివరి నాటికి పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది సర్కార్‌.

జిల్లా సెలక్షన్‌ కమిటీ నేతృత్వంలో నియామక ప్రక్రియ జరుగనుంది. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్లు చైర్మన్‌ గా వ్యవహరించనున్నారు. ఇక ఇందులో డీఎంహెచ్‌ఎం, సోషల్‌ వెల్ఫేర్ డీడీ, టీవీవీపీ అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ మెడికల్‌ ఆఫీసర్ల నియామకానికి ఈ నెల 28న నోటిఫికేషన్‌ రిలీజ్‌ కానుంది. ఆ రోజు నుంచి అక్టోబర్‌ 12 వరకు దరఖాస్తునలు స్వీకరించనున్నారు. దరఖాస్తులను పరిశీలించి… అక్టోబర్‌ 26 న మెరిట్‌ లిస్ట్‌ ను ప్రకటించి.. 27 వ తేదీన కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news