తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ క్లాస్ పిల్లలకు నో ఎగ్జామ్స్ ?

Join Our Community
follow manalokam on social media

అందరూ తగ్గిపోయింది అని భావించిన కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. తెలంగాణలో మరీ ముఖ్యంగా పాఠశాలలే టార్గెట్ అన్నట్లుగా రోజు ఏదో ఒక స్కూల్లో గంపగుత్తగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. దీంతో అసలు పాఠశాలలు మూసి వేయాలని డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. ఈ అంశం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రెండు రోజుల క్రితం అసెంబ్లీలో ప్రస్తావించారు. ఒకటి రెండు రోజుల్లో అసెంబ్లీలో దీని గురించి ప్రస్తావన ఉంటుందని అన్ని విషయాల మీద చర్చించి ఒక నిర్ణయానికి వస్తామని ప్రకటించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ విషయం మీద తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అదేమంటే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న పిల్లలకు పరీక్షలు పెట్టకుండానే నేరుగా వారిని పై తరగతులకు ప్రమోట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక 6, 7, 8 తరగతుల పిల్లలకు నేరుగా బోధన నిలిపి వేసి మళ్లీ ఆన్లైన్ బోధన ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక తొమ్మిదో తరగతి విషయంలో ఏం చేయాలి అన్న దాని మీద ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి. అయితే పదో తరగతి వారికి మాత్రం నేరుగా విద్యాబోధన జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సోషియో అవుట్ లుక్ నివేదికలో ఈ అంశాలను ప్రభుత్వం పేర్కొంది.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...