శ్రీరెడ్డి గెలిచింది.. ఇక మనోళ్ల పని ఫట్టే..

-

టాలీవుడ్‌లో కలకలం సృష్టించిన కాస్టింగ్‌ కౌచ్‌కి వ్యతిరేకంగా శ్రీరెడ్డి గళమెత్తి, మా అసోషియేషన్‌ నిరణయానికి వ్యతిరేకంగా వివస్త్రగా మారింది. శ్రీరెడ్డి చేసిన పోరాటం మధ్యలో
పవన్‌ కళ్యాణ్‌పై చేసిన కామెంట్ల వల్ల దారి తప్పింది గానీ లేకపోయి ఉంటే శ్రీరెడ్డి రేంజ్‌ ఈ రోజు మరోలా ఉండేది. టాలీవుడ్‌లో ఛాన్స్‌ల కోసం వచ్చిన అమ్మాయిలను శారీరకంగా వాడుకుంటారన్నది శ్రీరెడ్డి వాదించింది. మొత్తానికి శ్రీరెడ్డి చేసిన పోరాటానికి చాలావరకు సపోర్టు లభించింది.

ఇప్పుడు ఈ కాస్టింగ్‌ కౌచ్‌, లైంగిక వేధింపులపై ఫిర్యాదులు స్వీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. దీనికోసం ప్యానల్‌ను ఏర్పాటు చేస్తూ జీవో 984 విడుదల చేసింది.. సినిమా పరిశ్రమలో మహిళలకు జరిగే అన్యాయాలను ఈ ప్యానల్‌కు విన్నవించుకోవచ్చు.. టాలీవుడ్‌ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ప్రభుత్వం జీవో విడుదల చేయడం ఓ రకంగా శ్రీరెడ్డి విజయంగా చెప్పుకుంటున్నారు ఫిలిం నగర్‌లో..



సినీ పరిశ్రమ నుండి నటి సుప్రియ, నటి, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిలను ఈ ప్యానెల్‌లో మెంబర్లుగా నియమించారు, ఇంకా నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయ లక్ష్మి కూడా ప్యానల్‌ లో ఉన్నారు. ఈ కమిటీకి చైర్మన్‌గా రాంమోహన్ రావును నియమించినట్టు వెల్లడించారు. నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్ మోహన్ రావు, సుధాకర్ రెడ్డి కూడా ఈ ప్యానల్‌లో సభ్యులు.

మొత్తానికి సినీ పరిశ్రమలో వేధింపులకు గురయ్యే వారికి తోడ్పాటును అందించే దిశగా ప్యానల్‌ ఏర్పాటు చేయడం మంచి పరిణామం. అయితే ఈ విజయంలో శ్రీరెడ్డికి ఎక్కువ భాగం చెందుతుంది. శ్రీరెడ్డి ఇప్పటి ఎవరి వల్ల తను వేధింపులకు గురైనానని చెబుతుందో మరి వారి వీద కేసు నమోదు చేస్తుందో లేదో చూడాలి.. ఒక వేళ శ్రీరెడ్డి కనుక కేసు పెడితే సినీ పరిశ్రమలోని పెద్ద తలకాయలకు ఇబ్బందే…

Read more RELATED
Recommended to you

Latest news