మహర్షి గుమ్మడికాయ కొట్టేశాడు.. రిషి జర్నీలో భాగమయ్యేందుకు సిద్ధమా..!

-

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మిస్తున్న సినిమా మహర్షి. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. మే 9న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాకు ఎట్టకేలకు గుమ్మడికాయ కొట్టేశారు. ముందు సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ చేద్దామని అనుకున్నా అనుకున్న టైం కు షూటింగ్ కాకపోవడంతో రిలీజ్ వాయిదా వేయాల్సి వచ్చింది.

ఇక మహర్షి విషయానికొస్తే.. సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమా ఇది. మహేష్ రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక సినిమాలో రిషి జర్నీలో మనం కూడా భాగం అయ్యేలా ఉంటుందట. మహేష్ స్నేహితుడిగా అల్లరి నరేష్ గమ్యం తర్వాత అంత మంచి పాత్ర చేస్తున్నాడని తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికీ రిలీజైన రెండు సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. భరత్ అనే నేను తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news