హైదరాబాద్ ఆరేళ్ల చిన్నారి కుటుంబానికి తెలంగాణ ఆర్థిక సాయం

-

హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలిక పై ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న రాజు అనే దుర్మార్గుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆ చిన్నారిని దారుణంగా హత మార్చాడు. అయితే ఆ ఆరేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య పై తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ సీరియస్ అయ్యారు. ఈ కేసు లో దోషులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.

ఆ బాలిక కుటుంబాన్ని ఆదుకునేందుకు తక్షణం రూ. 50 వేల ఆర్ధిక సాయం ప్రకటించినట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, సిటీ పోలీస్ కమిషనర్లతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి సత్యవతి రాథోడ్. దోషులు ఎంతటి వారైన ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఉక్కుపాదం తో అణిచివేయాలన్నారు. చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని… దోషులను కఠినంగా శిక్షించి న్యాయం చేస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news