కుటుంబానికి ఐదు నాటు కోళ్లు : తెలంగాణ సర్కార్ కొత్త స్కీం !

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లోని పేదలకు నాటు కోళ్లు అందించే కొత్త స్కీం కు నాంది పలకాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. దీని కోసం ఏకంగా 163 కోట్లు ఖర్చు పెట్టనుంది సర్కార్. 58 లక్షల కుటుంబాలు లక్ష్యంగా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు యోచిస్తోంది. నాటు కోళ్ల పెంపకంతో పేదలకు ఆదాయం సమకూర్చడం తో పాటు రూరల్ ఏరియా లో… న్యూట్రీషియన్ లోపాన్ని అధిగమించవచ్చు అని అంచనా వేస్తోంది ప్రభుత్వo.


163 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా రెండు కోట్ల నాటు కోళ్లను పంపిణీ చేయడానికి తెలంగాణ పశు సంవర్ధక శాఖ ప్లాన్ చేస్తోంది. యూనిట్ కు ఐదు కోట్ల చొప్పున ఏటా… 40 లక్షల కోట్లను ఐదేళ్లపాటు పంపిణీ చేయాలని భావిస్తోంది. వీటిలో 60 నుంచి 70 శాతం కోళ్లు సర్వైవ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఈ కోళ్ళతో బేటా 85 కోట్ల గుడ్లు 8.5 మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి అవుతుందని లెక్కలు వేసింది. గుడ్ల ఉత్పత్తి తో వేగంగా 350 కోట్లు అలాగే… కోళ్ల అమ్మకాలతో 290 కోట్లు మొత్తం 630 కోట్లు ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news