టీ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి ఇప్ప పూవు పంపిణీ

ఇప్ప పూవు అంటే చాలా మందికి తెలిసి ఉండక పోవచ్చు. కానీ కాస్త ఏజెన్సీ ప్రాంతం వారికి, వారికి దగ్గరలో నివసించే వారికి దీని గురించి బాగా తెలుసు. ఒకరకంగా ఆదివాసీలు దీనిని మత్తు పదార్థం గా వాడుతూ ఉంటారు. దీనితో సారా కూడా తయారు చేసుకుని పుచ్చుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా తెలంగాణలో దొరికే ఈ ఇప్ప పూవు అయితే మరింత మత్తు ఎక్కిస్తుంది.

తెలంగాణలో ఏజన్సీ ప్రాంతంలోని ఆదివాసీలకు ఒక రకంగా ఇది ప్రధాన ఆదాయవనరు అని కూడా చెప్పవ్చు. ఈ పూవును తెలంగాణలో ఉన్న గర్భిణీలకు పంపిణీ చేయాలని గిరిజన సంక్షేమ శాఖ భావిస్తోంది. ఈరోజుల్లో మహిళల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా ఏజెన్సీ మహిళల్లో రక్త హీనత సమస్యలు ఎక్కువ, గర్భిణుల్లో అయితే ఇది మరీ ఎక్కువ అయి ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో వారిలో ఈ ఐరన్ శాతం పెంచేందుకు గాను లడ్డూల రూపంలో ఈ పూవు పంపిణీ చేయనుననట్లు చెబుతున్నారు.