తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం…!

-

తెలంగాణాలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో ఇప్పుడు కఠిన నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది తెలంగాణా సర్కార్. దేవాలయాలను రాష్ట్ర వ్యాప్తంగా మూసి వేసారు. భక్తులను ఎక్కడా కూడా అనుమతించడం లేదు. లాక్ డౌన్ ని చాలా వరకు కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.

తిరుమల శ్రీవారికి కూడా ఏకాంతంగా నిత్య పూజా కైంకర్యలను నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి అన్ని దేవాలయాలకు ఉంది. తెలంగాణ ప్రభుత్వం భక్తుల కోసం… లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఆలయాన్ని సందర్శించే వీలు లేకపోవడంతో.. ఆన్‌లైన్ ద్వారా దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. సోమవారం నాడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నారసింహుడి ఆర్జిత సేవలను ఆన్‌లైన్‌ విధానం ద్వారా ప్రారంభించారు అధికారులు. పూర్తి వివరాలను ts.meeseva.telangana.gov.in లో తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news