మందు బాబులకు తెలంగాణా ప్రభుత్వం బిగ్ షాక్…!

-

తెలంగాణాలో లాక్ డౌన్ ఏమో గాని ,మందు బాబులకు ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పట్లో మందు షాపులు తెరిచే ప్రసక్తే లేదని తెలంగాణా ప్రభుత్వం స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా ఏప్రిల్ ఒకటి నుంచి మందు షాపులు తెరిచే అవకాశాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. జాగ్రత్తలు తీసుకుంటూ మద్యం అమ్మకాలు జరుపుతారు అనే ప్రచారం జరిగింది.

లాక్ డౌన్ ఉన్న ఏప్రిల్ 14 వరకు వైన్స్ తెరిచేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా దీనిపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ డైరెక్ట‌ర్ ఉత్తర్వులు జారీ చేశారు. వైన్ షాపులు, బార్లు, క్ల‌బ్స్, టూరిజం బార్లు, క‌ల్లు దుకాణాలు మరో రెండు వారాల పాటు బంద్ అవుతాయని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని, డిప్యూటీ క‌మిష‌న‌ర్లు, అసిస్టెంట్ క‌మిష‌న‌ర్లు, జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ మేరకు జీవో విడుదల చేసింది. ఇక ఇదిలా ఉంటే తెలంగాణాలో కల్లు దొరకక ఇప్పుడు కొందరు మందు బాబులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. భార్య విడాకులు ఇచ్చినా కూడా ఇంత బాధ పడే పరిస్థితి ఉండేది కాదేమో. మానసిక సమస్యలతో చాలా మంది ఇప్పుడు ఎర్రగడ్డ కు వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news