ఎంసెట్ విషయంలో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం..

-

ఎంసెట్ విషయంలో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే 2019 – 20 విద్యా సంవత్సరానికి ఇంటర్ లో 45 శాతం మార్కులు వస్తేనే ఎంసెట్ ర్యాంకుకి అర్హులు అనే నిబంధన తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా నేపధ్యంలో ఈ ఏడాది అడ్వాన్స్ సప్లిమెంటరీ నిర్వహించకుండానే అందరికీ 35 మార్క్ లు వేసి పాస్ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

ఇక ఓపెన్ స్కూల్ , ఇంటర్ లలో పాస్ అయిన విద్యార్థులు 350 మంది దాకా ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఇంటర్ బోర్డ్, ఎంసెట్ అధికారులతో సమావేశం అయిన విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ ఈ మేరకు నిర్ణయాన్ని వెల్లడించారు. ఇక ఇదే విషయమై తెలంగాణా హైకోర్టు ఈరోజు జరగాల్సిన ఎంసెట్ కౌన్సెలింగ్ ని కూడా వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news