మంత్రి హరీష్ రావు: 1520 ఉద్యోగాలకు నోటిఫికేషన్ … !

-

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సీఎంగా ఉన్న కాలంలో పాలన పట్ల దాదాపుగా సగం మందికి పైగానే పాజిటివ్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. లోలోపల జరిగే అవకతవకల విషయాన్నీ పక్కన పెడితే ప్రజలకు అందాల్సిన పథకాలు మరియు జబ నోటిఫికేషన్ ల విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ఉంది. అందులో భాగంగా తాజాగా మంత్రి హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణాలో 1520 పోస్ట్ లకు గాను నోటిఫికేషన్ విడుదల చేసినట్లు శుభవార్తను అందించారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ముల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అందుకే వెంటనే వీటిని భర్తీ చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించి ఈ నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నామని తెలిపారు.

ఇప్పటికే ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగ మేళా జరుగుతున్నందున కమిషనర్ అఫ్ హెల్త్ అండ్ ఫామిలీ వెల్ఫేర్ విభాగంలో ఈ పోస్టులు ఉంటాయని తెలియచేశారు మంత్రి హరీష్ రావ్. ఈ పోస్ట్ లకు గాను ఆగష్టు 25 నుండి సెప్టెంబర్ 19 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news