ఈ ఏడాది బడ్జెట్‌ను శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై ఇంకా ఆమోదం తెలపకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అనుమతిచ్చేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోర్టును కోరింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యాహ్నం ఒంటిగంటకు విచారణ జరిపేందుకు అంగీకరించిన సీజే ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
‘‘ఈ విషయంలో గవర్నర్‌కు కోర్టు నోటీసు ఇవ్వగలదా? ఆలోచించుకోండి. గవర్నర్ విధుల్లో కోర్టులు న్యాయసమీక్ష చేయొచ్చా? కోర్టులు మితిమీరి జోక్యం చేసుకుంటున్నాయని మీరే అంటారు కదా?’’ అని అడ్వకేట్ జనరల్ (ఏజీ)ను ఉద్దేశించి ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్‌పై జరిగే విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తారని ఏజీ తెలిపారు.
023-24 బడ్జెట్‌ను అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా.. దానికి గవర్నర్ తమిళిసై ఇంకా ఆమోదం తెలపకపోవడంతో అధికార వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మరో నాలుగు రోజులే సమయం ఉండటంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.